అనతికాలంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలోకి తారాజువ్వలా దూసుకొచ్చిన తారల్లో రెజీనా కసాండ్రా ఒకరు. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుస విజయాలు రెజీనాను పలుకరించాయి. ఆ తర్వాత రెజీనా కెరీర్ ఎందుకో ఒడిదుడుకులకు లోనైంది. అందుకు కారణం ఓ మెగా హీరోతో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. ప్రేమ, పెళ్లి అంశాల మధ్య రెజీనా నలిగిపోయింది. దాంతో ఆమె స్టార్‌డమ్‌కు గండిపడింది. ఆమె తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లందరూ అగ్రతారలుగా కొనసాగడం విశేషం.
ఈ విషయాలపై రెజీనా మనసు విప్పి మాట్లాడింది. నటిని కావాలనేది నా కోరిక .. అందుకే నేను ఈ రూట్లోకి వచ్చాను. పదేళ్ల కెరియర్లో ఎన్నో మలుపులు చూశాను. ప్రేమలో పడటం వంటి పొరపాట్లు కూడా చేశాను. పొరపాటు చేస్తున్నాను అని తెలుసుకునేలోగా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి. ఫలితంగా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాను. ఇక ఇప్పుడు నా దృష్టంతా కెరియర్ పైనే. మంచి అవకాశాలను దక్కించుకుంటూ .. సక్సెస్ లను సొంతం చేసుకుంటూ నేనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాను” అంటూ చెప్పింది రెజీనా.