మీ ఇష్టమొచ్చినట్టు రేప్ లు చేస్తారా?

212
rejina
- Advertisement -

 చెన్నై నుంచి టాలీవుడ్‌కి  దిగుమతి అయిన హీరోయిన్ రెజీనా వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీ అయిపోయింది.  వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటోంది.  ప్రతి చిత్రంలోనూ ఆమె యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  రొటీన్ లవ్ స్టోరీ,  రా..రా..కృష్ణయ్య, పవర్  చిత్రాలలో ఈ అమ్మడు న‌టించి అభిమానుల గుండెల్లో పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది.

regina-cassandra

ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈ భామ చేసిన కామెంట్లు హాట్ టాఫిక్ గా మారాయి. ఇంతకు ఈ బ్యూటీ ఏం కామెంట్స్ చేసిందని ఆశ్చర్యపోతున్నారా..? ఎక్స్ పోజింగ్ చేస్తే , గ్లామర్ గా కనిపించడానికి చిన్న చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేస్తారా ? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నేను చీర కట్టుకుంటేనే సంప్రదాయబద్ధంగా ఉన్నట్టా? ట్రెండీగా బట్టలు వేసుకుంటే.. అదో టైపని అర్థమా? డ్రెస్సులను బట్టి కేరెక్టర్ డిసైడ్ చేస్తారా? అని ప్రశ్నిస్తోంది రెజీనా. ఇష్టం వచ్చినట్లు రేప్ చేస్తారా ? అసలు చిన్న పిల్లలను , ముసలి వాళ్ళని కూడా రేప్ చేస్తున్నారు కదా ! మగాళ్ల మైండ్ సెట్ మారాలి కానీ మేము కాదు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది రెజీనా కాసాండ్రా.

Rejina-

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ తమిళ భామ స్టార్ హీరోయిన్ కావాలని కళలు కంటోంది కానీ కుదరడం లేదు పాపం.  టీనేజ్ లో ఉన్నప్పుడు ఈ భామ కూడా వేధింపులు ఎదుర్కొందట .

- Advertisement -