కాంగ్రెస్‌లో ఆ ఇద్దరే మిగులుతారు..!

361
rega kantha rao
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ తలుపులు తెరిస్తే కాంగ్రెస్‌లో ఉత్తమ్,భట్టి తప్ప ఎవరు మిగలరని తెలిపారు ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. మణుగూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాంతారావు గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని చెప్పారు.

టిఆర్ఎస్ నాయకులు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను పార్టీ మార్చడం కోసం పని చేస్తే కాంగ్రెస్ పార్టీలో మిగిలేది ఉత్తమ్ కుమార్ , భట్టి లేనని తేల్చిచెప్పారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తాను కేసీఆర్ మనిషినేనని టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అనాలోచిత నిర్ణయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వారిని నమ్ముకుని ఎంత కాలం పని చేస్తామని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నాయకులను పిలవాల్సిన అవసరం లేదన్నారు.

నియోజకవర్గ సమస్యలపై సీఎం కేసీఆర్‌ను కలుస్తానంటే, వీల్లేదంటూ కాంగ్రెస్‌ నేతలు ఆంక్షలు పెట్టారని అయినా వెరవకుండా సాగు నీరు, తాగు నీరు, పోడు భూముల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లు అని చిన్నచూపు చూడకుండా వెనువెంటనే పరిష్కారానికి ఆదేశించారని చెప్పారు.

- Advertisement -