స్పర్శ్‌ హోస్పైస్‌కు ప్రభుత్వ ప్రోత్సాహం..

179
Reforms will be implemented
- Advertisement -

స్పర్శ్‌ హోస్పైస్‌కు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.  నగరంలోని నానక్‌రామ్‌గూడలో స్పర్శ్‌ హోస్పైస్‌కు శంకుస్ధాపన చేసిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్  క్యాన్సర్ రోగులకు  స్పర్శ్‌ హోస్పైస్‌ అండగా ఉండడం గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు. జీవితం చివరి దశలో ఉన్న వారికి అండగా ఉండటం అభినందనీయమని ప్రశంసించారు.

Reforms will be implemented
ప్రజలకు ఉపయోగపడే మెడిసిన్ విషయంలో ఇంకా సంస్కరణలు తీసుకువస్తామని ప్రకటించారు కేటీఆర్.  దేశవ్యాప్తంగా ప్రజా పాలన వ్యవస్థతో పాటు మార్పు రావాలన్నారు. రాజకీయ నాయకులను బట్టి అధికారులు పని చేస్తారని…. ఇలాంటి వాతావరణం పోవాలన్నారు. అధికారుల సహకారం ఉంటేనే పనులు తొందరగా పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పటికీ.. అభివృద్ధిలో మిగతా రాష్ర్టాలతో పోటీ పడుతుందని పేర్కొన్నారు.

క్యాన్సర్ రోగులు ఉండటానికి స్పర్శ్ హూస్పైస్‌ లో ఉచిత సదుపాయం కల్పించనున్నారు. ఎకరం స్థలంలో స్పర్శ్ హూస్పైస్ ఏర్పాటు కానుంది. స్పర్శ్‌కి 33 ఏళ్లకు ఎకరం స్థలాన్ని ప్రభుత్వం లీజుకు ఇచ్చింది.

- Advertisement -