విటమిన్ డి తగ్గితే..ఎన్ని ప్రమాదాలో!

52
- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు చాలా అవసరం. వీటిలో ఏవి లోపించిన ఆరోగ్యం గాడి తప్పుతుంది. లేని సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో చాలమంది విటమిన్స్ లోపంతో బాధపడుతున్నారు. అందులోనూ మరి ముఖ్యంగా డి విటమిన్ కొరత నూటిలో తొంబై శాతం మంది ఎదుర్కొంటున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. విటమిన్ డి కి ప్రధాన కేంద్రం సూర్యరశ్మి.. సహజ సిద్దగా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఇది కొవ్వుల్లో కరుగుతుంది. విటమిన్ డి లో డి1, డి2, డి3 అనే రకాలు ఉంటాయి. డి2 మరియు డి3 మనుషులకు అత్యంత అవసరమైన సమ్మేళనం. ఇది శరీరానికి కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందించడంలో ముఖ్య పోషిస్తుంది. అంతే కాకుండా జీవక్రియ సక్రమంగా జరగడంలో కూడా విటమిన్ డి పాత్ర అధికంగా ఉంటుంది. మరి అలాంటి విటమిన్ డి లోపిస్తే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలుసుకుందాం.. !

Also Read:Harish:ప్రతిపక్ష నేతలే టార్గెట్ ఎందుకు?

విటమిన్ డి లోపించిన వారిలో ముఖ్యంగా ఎముకలు బలహీన పడతాయి. అంతే కాకుండా ఎముకలు సన్నగా పేలుసుగా తయారయ్యే వాటి ఆకృతి కూడా మారిపోయే ప్రమాదం ఉంది. దాంతో బరువులు ఎట్టలేకపోవడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు చుట్టూ ముడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో విటమిన్ డి లోపంతో రికెట్స్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఇంకా విటమిన్ డి లోపం కారణంగా మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ను యాక్టివ్ చేయడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. .

ఒకవేళ శరీరంలో విటమిన్ డి తగ్గితే ఇన్సులిన్ హార్మోన్ లో హెచ్చుతగ్గులు ఏర్పడి.. మధుమేహానికి దారి తీస్తుంది. ఇంకా విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలే సమస్య అధికమౌతుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక రుగ్మతలు కూడా దారి చేరే ప్రమాదం ఉందని అద్యయానాలు చెబుతున్నాయి. ఇంకా విటమిన్ డి లోపం కారణంగా.. ఒళ్ళు నొప్పులు కండరాల బలహీనత, నరాల బలహీనత వంటి సమస్యలు కూడా చుట్టూ ముట్టె ప్రమాదం ఉందట. అందువల్ల విటమిన్ డి పుష్కలంగా మన శరీరానికి అందాలంటే ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల సమయంలోనూ అలాగే సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలోనూ తప్పనిసరిగా సూర్యరశ్మి లో ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -