సినిమాల మీద ప్యాషన్‌తో రమణ్ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. సీనియర్ హీరో వినోద్ కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం విశేషం. సిరి మూవీస్ బ్యానర్‌పై కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా హీరో సుమన్ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్ర బృందం. టైటిల్ ఆసక్తికరంగా ఉందనీ, సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాననీ సుమన్ అన్నారు. పోస్టర్‌లో హీరో లుక్ ఆకట్టుకుంటోంది. అతని మెడలో గన్ లాకెట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.
కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా రూపొందుతోంది. పక్కింటి కుర్రాడి తరహాలో హీరో పాత్ర నడుస్తుంది. ఎనర్జిటిక్‌గా, చాలా యాక్టివ్‌గా హీరో కనిపిస్తాడు. సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉంటారు. ఆ నలుగురితో హీరో ఏయే సందర్భాల్లో లవ్‌లో పడతాడు, చివరకు ఏ హీరోయిన్‌తో సెటిల్ అవుతాడనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే హీరో, విలన్ మధ్య సంబంధమేంటనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు.
యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేసే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. సరికొత్త స్క్రీన్‌ప్లేతో అందర్నీ ఎంటర్‌టైన్ చేసే విధంగా సినిమా రూపొందుతోంది. విలన్‌గా వినోద్ కుమార్ ఆకట్టుకుంటారు. హీరోగా రమణ్‌కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. ఎ.కె. ఆనంద్ సినిమాటోగ్రఫీ, మహిత్ నారాయణ్ మ్యూజిక్, శ్రీవసంత్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్సవుతాయి. అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు సమకూర్చిన ఫైట్స్, చందు రామ్, రాజ్ పైడి, సాయిశివాజీ కొరియోగ్రఫీ అందించిన పాటలు అలరిస్తాయి.
తారాగణం:రమణ్, వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత, వినోద్ కుమార్, రచ్చ రవి, మిర్చి మాధవి, జూనియర్ బాలకృష్ణ, శంకర్, కృష్ణ, ప్రకాష్ అడ్డా, వెంకట్, సిద్ధు
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: ఎం. రమేష్, గోపి
నిర్మాత: కె. శిరీషా రమణారెడ్డి
బ్యానర్: సిరి మూవీస్
సమర్పణ: కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి
సంగీతం: మహిత్ నారాయణ్
బ్యాగ్రౌండ్ స్కోర్: శ్రీవసంత్
సినిమాటోగ్రఫీ: ఎ.కె. ఆనంద్
ఎడిటింగ్: శ్రీనివాస్ పి. బాబు, సంజీవరెడ్డి
ఆర్ట్: నరేష్ సిహెచ్.
ఫైట్స్: అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు
కొరియోగ్రఫీ: చందు రామ్, రాజ్ పైడి, సాయిశివాజీ
పీఆర్వో: వంశీ-శేఖర్