నారా లోకేశ్…ఈ పేరు చెబితే గుర్తుకొచ్చేది రెడ్ బుక్. ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ పట్టుకుని ప్రజల్లో జోష్ తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని టీడీపీ నేతలపై అడ్డగొలు కేసులు, ఇబ్బందులకు గురి చేసిన అధికారులే టార్గెట్‌గా వారి పేర్లను రెడ్ బుక్ లో రాశానని తెలిపారు.
ఎన్నికల్లో కూటమి తిరుగులేని మెజార్టీతో విజయం సాధించడం,లోకేష్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి రెడ్ బుక్‌పైనే ఉంది. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని వార్నింగ్‌లిస్తుండటంతో కొందరు అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయిందట.
ప్రధానంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో రెడ్ బుక్ అంటేనే వణికిపోతున్నారు. రెడ్‌బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఎస్‌ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని వారిపై చర్యలు తప్పవని టీడీపీ నేతలు చెబుతున్నారు. తప్పు చేసిన వారిని, కట్టు తప్పిన వారిని శిక్షించకుండా వదిలేస్తే… అది వారికి అలవాటుగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా రెడ్‌బుక్‌లో కొంతమంది అధికారుల పేర్లు లోకేష్ వెల్లడించగా ఇంకెంతమంది పేర్లు ఉన్నాయోనన్న టెన్షన్ మొదలైంది.
Also Read:‘హరోం హర’కి అద్భుతమైన రెస్పాన్స్