భారీ వర్షాలు..ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్!

28
- Advertisement -

తెలంగాణలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఒడిశా, ఉత్తరాంధ తీరాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని దీని ఫలితంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. శనివారం తెల్లవారు జామున వాయువ్యదిశగా పయణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.

ఇవాళ కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందంటూ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది.

Also Read:Varuj Tej: వైజాగ్‌లో వరుణ్ ‘మట్కా’

- Advertisement -