ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

3
- Advertisement -

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని వాయుగుండం బలపడింది. ఇవాళ సాయంత్రం వరకు ఒడిశాలోని పూరీ సమీపంలో తీరందాటే అవకాశాలుండగా మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండం తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు గరిష్టంగా 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ పట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తాండవ జలాశయం వరద రహదారిపై పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read:జర్నలిస్టులు అందరికి ఇళ్ల స్థలాలు: సీఎం రేవంత్

- Advertisement -