ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో పుష్పరాజ్ సందడి చేస్తున్నాడు. బన్నీ, విదేశీ ఫైటర్ల నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నాడు సుకుమార్. చూస్తుంటే పుష్ప2 కోసం బన్నీ భారీగా ఖర్చు పెట్టించేలా ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే.. రీసెంట్ గా పుష్ప-2 నుంచి విడుదల చేసిన వీడియో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.
Also read: మంచు వారి పెళ్లి వీడియో..!
ఆ రికార్డు ఏమిటో తెలుసా ?.. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్, 3.3 మిలియన్ల లైక్స్ సాధించినట్లు వెల్లడిస్తూ మేకర్స్ ఓ గ్రాండ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే, ఈ 100 మిలియన్ల వ్యూస్, 3.3 మిలియన్ల లైక్స్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. పెయిడ్ వ్యూస్, పెయిడ్ లైక్స్ తో పుష్ప సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాడు అని.. అంతకు మించి పుష్ప రాజ్ పై ఈ రేంజ్ ఆసక్తి లేదని.. అసలు బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 చిత్రాలకు కూడా ఈ స్థాయి వ్యూస్ అండ్ లైక్స్ రాలేదు.
Also read: ఎన్టీఆర్ తో అందుకే ఒప్పుకున్నాడు
కాబట్టి.. పుష్ప 2 వీడియోకి వచ్చిన ఈ వ్యూస్ అండ్ లైక్స్ ను నమ్మలేం అని కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ గతంలో కూడా పుష్ప సినిమా విషయంలో స్వయంగా పెయిడ్ ప్రమోషన్స్ చేయించాడు. సో.. పుష్ప 2 వీడియో విషయంలో కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లోని ఫ్యాక్షన్ గొడవలని టచ్ చేస్తూ సాగే ఈ సినిమాలో సెకండ్ పార్ట్ కోసం కథలో కొన్ని మార్పులు కూడా చేశారట. మరి పుష్ప 2 సినిమా ఎలా ఉంటుందో చూడాలి.