చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ భారీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 231 బంతులాడిన రోహిత్ 18 ఫోర్లు, 2 సిక్స్‌లతో 161 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ అరుదైన రికార్డును అందుకున్నాడు. స్వదేశంలో టెస్టుల్లో 200 సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.
రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్ద రోహిత్ ఈ ఘనత సాధించాడు. రోహిత్ తర్వాత స్వదేశంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఉన్నాడు. స్వదేశంలో ఆయన మొత్తం 186 సిక్స్‌లు కొట్టాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 113 సిక్స్‌లు బాదాడు.
రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి ఇప్పటివరకు 428 సిక్స్ లు కొట్టాడు. ఈ జాబితాలో ప్రపంచంలోనే రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ మొత్తం కలిపి 534 సిక్స్ లతో తొలి స్థానంలో, పాక్ మాజీ ఆటగాడు ఆఫ్రిది 476 సిక్స్‌లతో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వారిద్దరి రికార్డులను రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశాలు లేకపోలేదు. ధోని 359 సిక్స్‌లతో ఆరో స్థానంలో ఉన్నాడు.