35 వేల మందితో మహా బతుకమ్మ

318
Record Maha Bathukamma feat in LB Stadium
Record Maha Bathukamma feat in LB Stadium
- Advertisement -

మహా బతుకమ్మ ఉత్సవంలో ఉయ్యాలపాటలతో భాగ్యనగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియం హోరెత్తుతోంది. 35 వేల మంది మహిళలతో మహా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఎల్బీ స్టేడియం పూలవనాన్ని తలపిస్తుంది.ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. 19 రాష్ర్టాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 15 రాష్ర్టాల నుంచి బ్రహ్మకుమారీలు తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు. 31 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు వలయాకారంలో లయబద్దంగా బతుకమ్మ ఆడుతున్నారు. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడమే లక్ష్యంగా బతుకమ్మ ఆడుతున్నారు మహిళలు. గత సంవత్సం 9252 మంది మహిళలు ఒకేచోట బతుకమ్మ ఆడి గిన్నిస్ రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.

bathukamma-kavitha

ఎల్బీస్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేసిన ప్రతీ ఒక్కరికి తెలంగాణ జాగతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ధన్యవాదాలు తెలియజేశారు. మహా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడటం సాధారణ విషయం కాదన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా తెలంగాణ పండుగలు మరుగున పడిపోయాయన్నారు. బతుకమ్మకు ఇంతటి గుర్తింపునకు కారణం ఎంపీ కవితేనన్నారు. బంగారు తెలంగాణను అందరం కలిసి సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

 మహా బతుకమ్మలో పాల్గోనే ఆడబిడ్డలకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు.మంచినీళ్లు, భోజన వసతి.. ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు. మహాబతుకమ్మ జరిగే ఎల్బీ స్టేడియం పరిసర మార్గాల్లో నగర పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ వేడుకల్లో జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మామిడి హరికృష్ణ, బుర్రా వెంకటేశం, పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో సోమవారం నిర్వహించిన 31అడుగుల మహాబతుకమ్మ ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ఆఫ్‌ రికార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలంగాణ బుక్‌ఆఫ్‌ రికార్డుల్లో నమోదైన పత్రాలను ఉత్సవాల నిర్వాహకుడు కవి, ఉపాధ్యాయుడు మేకల రాజశేఖర్‌ గౌడ్‌కు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అందజేశారు. కాగా, జగిత్యాల లో బల్దియా ఆధ్వర్యంలో 7 క్వింటాళ్ల పూలను ఉపయోగించి, 16 అడుగుల బతుకమ్మను రూపొందించారు.

- Advertisement -