వైభవోపేతంగా కాకతీయ సప్తాహం : కేటీఆర్

30
ktr warangal
- Advertisement -

తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన అన్నివర్గాల మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించుకొవాలన్నారు. జూలై 7 నుంచి వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏడు రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ వైభవ సప్తాహంపై ప్రగతిభవన్‌లో సోమవారం సన్నాహక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్ఠను పెంచేవిధంగా రాజకీయాలకు అతీతంగా, అందరూ పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. సాహితీ, సాంసృతిక, కళ కార్యాక్రమాలను, మేథో చర్చలను రూపొందించాలన్నారు. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. ప్రజలందరూ గర్వపడేలా ఉత్సవాలు ఉండాలని అధికారులను సూచించారు. వరంగల్‌ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్‌ దీపకాంతులతో వరంగల్‌ను తీర్చిదిద్దాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహన్ని విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు.

అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాసర్‌, ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌, సాంసృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -