Recession In India: దేశంలో ఆర్ధిక మాంద్యం!

0
- Advertisement -

2024 సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ఈ 11 నెలలుగా దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి నిరుద్యోగం. దీనికి తోడు పట్టణ వినిమయం పడిపోతుండగా కుటుంబ రుణభారాలు పెరిగిపోతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్ల పరిస్థితి అదేవిధంగా ఉంది. అయితే బీజేపీ సర్కార్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్థి చెందుతున్నామని చెబుతున్న వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

దేశంలోని పట్టణ ప్రజల్లో వినిమయం తగ్గడం, కార్పొరేట్ల ఆదాయాల్లోనూ పతనం చోటు చేసుకుంటోంది. భారత్‌లో అన్ని రంగాల కంపెనీల్లో మందగమనం వైరస్‌ క్రమంగా విస్తరిస్తోంది. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులకు ప్రధాన గీటురాయిగా చూసే వాహన అమ్మకాల్లోనూ పతనం చోటు చేసుకుంది. భారత్‌లోని హెచ్చు ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాల పెరుగుదల మార్కెట్లపైనా ప్రతిబింబిస్తోంది.

గడిచిన రెండున్నరేండ్లలో ఆర్‌బీఐ ఒక్కసారి కూడా వడ్డీ రేట్లను తగ్గించలేదు. మరోవైపు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. తయారీ రంగంలోనూ డిమాండ్‌ సన్నగిల్లింది. ఏడాది క్రితంతో పోల్చితే వినియోగ దారుల్లో విశ్వాసం సన్నగిల్లిందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్, ట్విటర్, అమెజాన్ సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు రోజు వస్తూనే ఉన్నాయి. ఏ కంపెనీ ఎందరిని ఎప్పుడు తొలగిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐటి కంపెనీల్లో కోతలు, కంపెనీల్లో రోబోట్లు, ఏఐ వెరసీ భవిష్యత్ ఏంటనేది తెలియక యువత నైరాశ్యంలో ఉంది. మొత్తంగా మందగమనం తదుపరి మాంద్యం, అది ముదిరితే ఆర్థిక సంక్షోభం..మరి రాబోయే సంవత్సరాల్లోనైనా దీనిని భారత్ ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచిచూడాలి.

Also Read:మాజీ మంత్రి హరీశ్‌ రావుకు బిగ్ రిలీఫ్

- Advertisement -