అతనితో సినిమా.. ఇది ప్ర‌భాస్ కోరిక‌ అట

67
- Advertisement -

చేతిలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్ మీదే త‌న దృష్టంతా పెట్టాడు. అయితే ప్ర‌భాస్‌కు ఎప్ప‌టినుంచో ఓ బ‌ల‌మైన కోరిక ఉంద‌ట‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఓ మంచి ఫ్యామిలీ మూవీ చేయాల‌న్నది ప్ర‌భాస్ కోరిక అని స‌న్నిహితులు చెప్తున్నారు. ఒక‌వేళ ఈ సినిమా ప‌ట్టాలెక్కితే యూవీ, హారిక క్రియేష‌న్స్ భాగ‌స్వామ్యంలో ఉంటుంద‌ని కూడా అంటున్నారు. ఇపుడున్న సమాచారం ప్రకారం 2025 లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. మహేష్ – త్రివిక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతున్న గుంటూరు కారం సినిమా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా వ‌ర్క్ మొత్తాన్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి, డిసెంబ‌ర్ నెలాఖ‌రులో మ‌హేష్ న్యూ ఇయ‌ర్ వెకేష‌న్‌కు వెళ్ల‌నున్నాడ‌ని తెలుస్తోంది. మ‌హేష్ వెకేష‌న్ నుంచి వచ్చాక గుంటూరు కారం ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌నున్నాడ‌ట‌. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ప్రభాస్ కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తాడట.

Also Read:Harishrao: ఏ సర్వే చూసినా కారుదే జోరు

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ‘సలార్’ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. తాజాగా ‘సలార్’ సినిమా యూఎస్ బుకింగ్స్ గురించిన న్యూస్ వైరల్‌ అవుతోంది. నార్త్ అమెరికాలో ఈ మూవీ బుకింగ్స్ నవంబర్ 20 నుంచి మొదలు కాబోతున్నట్లు తెలిపారు మేకర్స్. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓపెన్ చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

- Advertisement -