రోజా కు మంత్రి పదవి రాకపోవడానికి అదొక్కటే కారణం?

250
Actress Roja injured and bleeding

ఏపీ క్యాబినెట్ కొలువుదీరింది. 25మంది మంత్రులతో జగన్ తన క్యాబినెట్ తో ప్రమాణం చేయించారు. ఇక చాలా మందికి మంత్రి పదవులు పక్కాగా వస్తాయి అనుకున్న వారికి షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించినా…చివరి నిమిషంలో మాత్రం వారి పేర్లు లేవు. ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న నేత ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా. రోజా ముందు నుంచి జగన్‌ వెంట నడిచారు.

అసెంబ్లీ లోపలా, బయటా ధాటిగా మాట్లాడారు. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులపై ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. కష్టకాలంలో జగన్‌కు తోడున్న లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు బెర్త్ పక్కా అని అంచనా వేశారు. అయితే రోజాకు మంత్రి పదవి దక్కకపోవడానికి చాలా కారణాలున్నాయి. కేబినెట్‌లో సామాజిక సమతూకం పాటించాలన్నది జగన్‌ సూత్రంగా పెట్టుకున్నారని తెలుస్తోంది.

అందుకే రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ బెర్త్‌లు ఇచ్చి, రెడ్డి రాజ్యంగా విమర్శలు ఎదుర్కోవడం ఎందుకని, రెడ్డీలకు కాస్త తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతోంది. రోజా రెడ్డి సామాజికవర్గం. అందుకే రోజాను జగన్‌ ప్రస్తుతానికి పక్కనపెట్టారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత ఛాన్స్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది.