శ్రీదేవిది ప్రమాదమా?.. ఆత్మహత్యా? అనే అనుమానాలు క్షణక్షణం పెరిగిపోతున్నాయి. లెజండరీ నటి శ్రీదేవి మరణంలో వెలుగుచూస్తున్న ట్విస్ట్‌లు చూస్తుంటే బోనీకపూర్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లు అనిపిస్తోంది.
ప్రస్తుతం బోనీకపూర్, హోటల్ సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు శ్రీదేవి, బోనీకపూర్ కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక ఇదిలాఉంటే..ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు దుబాయ్ పోలీసులు ట్రాన్‌ఫర్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ రంగంలోకి దిగి ఈ కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాగా బాత్‌టబ్‌లో ప్రమాదశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్దారిస్తారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ పూర్తయ్యేవరకు బోనీకపూర్‌ను దుబాయ్‌లోనే ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించారు.
అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు ప్రస్తావనే రాలేదు. మరి ఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏం తేల్చబోతున్నారు? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.