డింపుల్ హాయతి కేసులో అసలు నిజాలు

81
- Advertisement -

ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టడంతో పాటు నానా హంగామా చేసిందని డింపుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వివాదం ఏంటంటే.. పార్క్ చేసిన డీసీపీ కారును ఈనెల 14న రాత్రి డింపుల్ కారు ఢీ కొట్టింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డైంది. డింపుల్ వాదన మరో విధంగా ఉంది. అధికారంతో చేసిన తప్పును కప్పిపుచ్చలేరని.. తన కారుపై అకారణంగా చలాన్లు వేస్తున్నారని ఆరోపించారు. డింపుల్‌ పై వ్యక్తిగత విభేదాలు లేవని డీసీపీ రాహుల్ స్పష్టం చేశారు.

ఖిలాడీ, రామబాణం తదితర సినిమాల్లో నటించిన డింపుల్ హయాతి.. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. డింపుల్ హయాతి – మాచో స్టార్ గోపీచంద్ జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ జూన్ 3 నుంచి సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: ఎఫైర్ల పై కీర్తి సురేష్‌ తొలి రియాక్షన్

- Advertisement -