రియల్ ఎస్టేట్..మోసపోయిన జగపతిబాబు!

9
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలు, నటనకు కేరాఫ్‌ జగపతిబాబు. హీరోగా, విలన్‌గా విలక్షణ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు జగపతిబాబు. ప్రస్తుతం జగపతిబాబు ఖాతాలో వరుస సినిమాలు ఉండగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఆయన ప్రత్యేకత.

ఇక పలు ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని వెల్లడించగా తాజాగా రియల్ ఎస్టేట్ విషయంలో మోసం చేశారు అంటూ ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో హెచ్చరించారన్నారు.

ఇటీవల తాను ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాను. నన్ను కూడా మోసం చేశారు. వాళ్ళు ఎవరు అనేది త్వరలోనే చెప్తాను అన్నారు. ల్యాండ్ కొనేటప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకొని జాగ్రత్త పడండి. ఎవరి ట్రాప్​లో పడొద్దు అని సూచించారు. దీంతో జగపతిబాబును మోసం చేసింది ఎవరా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Also Read:NKR21లో రాములమ్మ!

- Advertisement -