జులై చివ‌ర్లో ‘రియ‌ల్ దండుపాళ్యం’

258
real dandupalyam

ద‌ర్శ‌కుడు మ‌హేశ్ తెర‌కెక్కించిన మూవీ రియ‌ల్ దండుపాళ్యం మూవీ ఈనెలాఖ‌రున విడుదల చేయ‌నున్నారు. ఈసినిమాలో క‌న్న‌డ ఫేమ్ రాగిణి ద్విగేది, మేఘ‌న రాజ్, దీప్తి, ప్ర‌థ‌మ ప్ర‌సాద్, సంయుక్త హొర్నాడ్ ప‌లువురు నటిన‌టులు న‌టించారు. శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ స‌మ‌ర్పించ‌గా సి. పుట్టు స్వామి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈసంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప‌లువురు న‌టీన‌టులు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు పాల్గోన్నారు.

Real Dandupalyam

ఇప్ప‌టి ఎవ‌రూ చేయ‌ని డిఫ‌రెంట్ కాన్పెప్ట్ తో మ‌హేశ్ సినిమా తీశాడ‌న్నారు నిర్మాత పుట్టు స్వామి. నేను తెలుగులో చేసిన మూడు సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయ‌న్నారు. సినిమా కూడా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నాన‌ని తెలిపారు. ఇలాంటి సినిమాలు స‌మాజానికి చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. క‌న్నడ‌లో టాప్ హీరోయిన్స్ కూతుర్లు ఈసినిమాలో హీరోయ‌న్లుగా న‌టించార‌న్నారు. ఈసినిమా ప్ర‌స్తుతం సెన్సార్ కార్యక్ర‌మంను పూర్తి చేసుకుంద‌ని ఈనెలాఖ‌రున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు నిర్మాత పుట్టు స్వామి.