చిరుతో బాలయ్య మల్టీస్టారర్…!

216
Ready to to multi-starrers with Chiranjeevi, Balakrishna
- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నానీ నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘అ!. అనుభవజ్ఞుడు కాకపోయినా ‘అ!’ద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు.అన్ని సినిమాలయందు ‘అ!’ సినిమా వేరయా అంటూ ప్రచారంలో వినూత్న శైలి చూపిస్తూ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ వర్మ చిరంజీవి, బాలకృష్ణలతో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కించాలని ఉందని వెల్లడించారు. చిన్నప్పటి నుంచే చదువతో పాటు సినిమాలపై ఆసక్తి ఉండేదని..ఆ ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. దీనమ్మ జీవితం అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీసానని అది యూ ట్యూబ్‌లో వైరల్‌గా మారిందని తెలిపారు.

prasanth-varma

‘అ!’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవికి కథ వినిపించే అవకాశం వచ్చిందని కానీ…చిరు లాంటి స్టార్ హీరోతో కలిసిపనిచేయడం రిస్క్‌ అనపించిందన్నారు. తన కెరీర్‌లో తప్పకుండా చిరు-బాలయ్య కాంబినేషన్‌లో మల్టీస్టారర్ తీసి తీరుతానని స్పష్టం చేశారు. మరి ఈ యువ దర్శకుడి కోరిక నేరవేరుతుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -