మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి..

426
Municipal elections
- Advertisement -

మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డాక్టరు హరీష్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో పురపాలక ఎన్నికల కసరత్తుపై జిల్లా (నోడల్) అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వారీగా బ్యాలెట్ బాక్స్ లను ఏర్పాటు చేసుకోవాలని, క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లను గుర్తించి మైక్రో అబ్సెర్వర్ లను లొకేషన్ల వారీగా నియమించాలన్నారు. వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించాలన్నారు. పోలీస్ బందోబస్ట్ పటిష్టమైన నిఘా, రూట్ మ్యాప్ తయారు చేయాలన్నారు.

ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే మొదటి దశ శిక్షణ పూర్తయిందని, రెండవ రండమైజేషన్ శిక్షణ కార్యక్రమం జనవరి 2న నిర్వహించడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్లలో పేర్లు, గుర్తులు, పోటీ చేసే అభ్యర్థుల అందరివి ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికలకు సంభందించిన నియమ నిబంధనలను పాటించాలన్నారు. రిసెప్షన్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -