పాయల్ రాజ్ పుత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

480
Payal Rajputh
- Advertisement -

ఆర్ఎక్స్ 100మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఈమూవీ భారీ విజయం సాధించడంతో పాయల్ కు మంచి గుర్తింపు లభించింది. ఈసినిమాలో తన అందం, నటనతో యూత్ మంచి క్రేజ్ ను ఏర్పరచుకుంది పాయల్. తాజాగా ఆర్టీఎక్స్ లవ్ మూవీలో నటించింది ఈ భామ. ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగ ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది పాయల్.

కెరీర్ ప్రారంభంలో తాను చాలా కష్టాలు పడినట్లు తెలిపింది. మోడలింగ్ రంగం ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టానని, అలాగే ముంబైలో ఉంటూ కొన్ని టీవీ సీరియల్స్ చేశానని, చెప్పింది. అయితే తాను టీవీ సీరియల్‌లో చేసే సమయంలో ఒక రోజుకు రూ.6 వేల రెమ్యూనరేషన్ అందుకున్నానని తెలిపింది.

తాను పంజాబ్ లో చేసిన ఒక్కో సినిమాకు మూడు లక్షలు ఇచ్చే వారని చెప్పింది. అలాగే తనకు హీరో ప్రభాస్, విజయ్ అంటే చాలా ఇష్టమని, అల్లుఅర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఇక ఈ భామ ప్రస్తుతం రవితేజ సరసన డిస్కో రాజా మూవీలో చేస్తుంది. ఆలాగే వెంకటేశ్ నాగచైతన్య కాంబినేషన్ తెరకెక్కిన వెంకీమామలో కూడా నటించినట్లు తెలిపింది.

- Advertisement -