ఇండియన్ ప్రీమియర్ లీగ్-11వ సీజన్లో భాగంగా ఈ రోజు( ఆదివారం) కోల్కత్త నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచి కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెంగుళూరు బ్యాటింగ్ కి దిగింది.
అయితే చావ్లా వేసిన 2వ ఓవర్ నాలుగో బంతిని రివర్స్ స్సీప్ చేసేందుకు ప్రయత్నించిన బెంగుళూరు ఓపెనర్ డికాక్(4) అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న దినేష్ కుమార్‌కి క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూం బాటపట్టాడు.
ఈ దశలో మరో ఓపెనర్ బ్రెన్డన్ మెక్కల్లమ్ జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే సునీల్ నరెన్ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి మెక్కల్లమ్(43) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కోహ్లీ, డివిలియర్స్‌ల జోడీ జట్టుని ఆదుకుంది. మూడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టుకి గౌరవప్రదమైన స్కోర్‌ను అందించింది. అయితే నితీస్ రానా వేసిన 15 ఓవర్లో డివిలియర్స్(44), కోహ్లీ(31) వరుస బంతుల్లో పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో మన్దీప్ సింగ్(37) ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలింగ్‌లో రానా, వినయ్ 2, చావ్లా, నరేన్, జాన్సన్ తలో వికెట్ తీశారు.