ఐపీఎల్ 2021…కోహ్లీ సేన బోణీ..

162
rcb vs mi
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ని విజయంతో మొదలు పెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబైనిని మట్టికరిపించి మంచి ఆరంభాన్ని సాధించింది ఆర్సీబీ. ముంబై విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు సాధించి గెలిచింది. డివిలియర్స్‌ (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకముందు టాస్ గెలిచిన ఆర్సీబీ….ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (23 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్‌ కిషన్‌ (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్షల్‌ పటేల్‌ పదునైన బౌలింగ్‌ (5/27)తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.

- Advertisement -