ఐపీఎల్ 2025లో భాగంగా క్వాలిఫైయర్ 1కి చేరుకుంది ఆర్సీబీ. లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 228 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ… 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 230 స్కోరుతో గెలిచింది.
కెప్టెన్ జితేశ్ శర్మ (85 నాటౌట్) అద్భత ప్రదర్శన చేయగా మయాంక్ అగర్వాల్ (41) పరుగులతో రాణించాడు. సాల్ట్ (30) , విరాట్ కోహ్లి (54) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో… లక్నో ఆటగాళ్లలో మిచెల్ మార్ష్ (67) హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ (118 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవగా, నికోలస్ పూరన్ (13), మాథ్యూ (12), అబ్దుల్ సమద్ (1 నాటౌట్) పరుగులతో రాణించారు.
లక్నోపై గెలుపుతో ఆర్సీబీ జట్టు క్వాలిఫయర్ 1లో ఆడే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి లక్నో వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసింది. పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు 19 పాయింట్లతో టాప్ 2లోకి దూసుకెళ్లింది.
Also Read:BRS:లండన్‌లో కేటీఆర్‌కు ఘనస్వాగతం

