RCB:ఆర్సీబీ రూ.10 లక్షల పరిహారం

6
- Advertisement -

కర్ణాటకలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించింది ఆర్సీబీ. అంతేకాదు.. ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది.

నిన్న బెంగళూరులో జరిగిన దురదృష్టకర ఘటన ఆర్సీబీ ఫ్యామిలీకి తీవ్ర వేదన కలిగించిందని రాయల్‌ చాలెంజన్స్‌ బెంగళూరు చెప్పింది. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.

అలాగే, ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కేర్స్ పేరుతో ఫండ్‌ను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. తమ ఫ్యాన్స్‌ ఎప్పటికీ తమ హృదయంలో ఉంటారని, తాము చేసే ప్రతి పనిలోనూ ఇది ప్రతిబింబిస్తుందని చెప్పింది.

Also Read:DSC పరీక్షలను వాయిదా వేయండి:షర్మిల

- Advertisement -