ఐపీఎల్ 2020లో కోహ్లీ సేన బోణి కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించి పట్టు నిలుపుకుంది.
బెంగళూరు విధించిన 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది.
లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ వార్నర్ వికెట్‌ను కోల్పోగా మరో వికెట్ పడకుండా బెయిర్‌స్టో- మనీశ్ పాండే జాగ్రత్త పడ్డారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 78,15వ ఓవర్ ముగిసేసరికి 121/2. 30 బంతుల్లో 43 పరుగులు చేస్తే సరిపోతుంది. చేతిలో 8 వికెట్లు హైదరాబాద్ విజయం లాంఛనమే అనుకున్నారు కానీ మ్యాచ్‌ను అనూహ్యంగా మలుపుతిప్పాడు చాహల్. ఒకే ఓవర్‌లో బెయిర్ స్టో,విజయ్ శంకర్‌ని ఔట్ చేయగా 17వ ఓవర్‌లో శివమ్ దూబే ప్రియమ్ గార్గ్ (12)ను బౌల్డ్ చేయగా… అభిషేక్ శర్మ (7) రనౌటయ్యాడు. 18వ ఓవర్లో భువీ (0),రషీద్ (6) కూడా వెనుదిరుగగా 18 బంతుల్లోనే 7 వికెట్లు కొల్పోయింది. దీంతో హైదరాబాద్ ఓటమి తప్పలేదు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), డివిలియర్స్ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో మెరిపించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చహల్ 3 వికెట్లు తీశాడు.