ఐపీఎల్‌లో రెండో విజయాన్ని నమోదుచేసింది ఆర్సీబీ. ఓటమి దాదాపు ఖాయమనుకున్న తరుణంలో మరో 5 బంతులు మిగిలిఉండగానే గెలిచి సత్తా చాటింది ఆర్సీబీ. షాబాజ్, దినేశ్ కార్తీక్ విధ్వంస ఆటతీరుపై బెంగళూరు విజయకేతనం ఎగురవేసింది.
రాజస్థాన్ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 173 పరుగులు చేసి గెలుపొందింది.దీంతో వరుస విజయాలతో జోష్ మీదున్న రాజస్థాన్ కు షాక్ తగిలింది. షాబాజ్ అహ్మద్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 నాటౌట్) అదరగొట్టారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (47 బంతుల్లో 6 సిక్సర్లతో 70 నాటౌ ట్), దేవ్‌దత్ పడిక్కళ్ (37), హెట్‌మయెర్ (42 నాటౌట్) రాణించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా దినేశ్ కార్తీక్ నిలిచాడు.