ఉత్కంఠ పోరులో ఆర్సీబీ గెలుపు…

47
rcb

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గెలుపు ఆశలు ఆవిరైన వేళ బెంగళూరు లెఫ్టామ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌

అహ్మద్‌ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి మ్యాజిక్ చేయడంతో హైదరాబాద్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆర్సీబీ విధించిన 150 పరుగుల లక్ష్య చేధనలో హైదరాబాద్ 143/9కే పరిమితమైంది. వార్నర్‌ (37 బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్‌తో 54), మనీశ్‌ పాండే (38) తప్ప అంతా విఫలమయ్యారు. రషీద్‌ ఖాన్‌ (9 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌తో 17) ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 149/8 స్కోరే చేసింది. మ్యాక్స్‌వెల్‌ (41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59) హాఫ్‌ సెంచరీతో చెలరేగగా, కోహ్లీ (29 బంతుల్లో 4 ఫోర్లతో 33) రాణించాడు. షాబాజ్‌ అహ్మద్‌ (3/7) మూడు, సిరాజ్‌, హర్షల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్‌వెల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.