గుజరాత్‌పై ఆర్సీబీ గెలుపు..

86
rcb
- Advertisement -

కీలకమ్యాచ్‌లో సత్తాచాటింది ఆర్సీబీ. ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు సత్తా చాటి గుజరాత్‌పై విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ…18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి గెలుపొందింది.

కోహ్లీ (73), డుప్లెసిస్‌ (44) రాణించగా మ్యాక్స్‌వెల్ (40*) ధాటిగా ఆడడంతో బెంగళూరు గెలుపొందింది. గుజరాత్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 168 పరుగులు చేసింది. సాహా 31, హార్ధిక్ 62, మిల్లర్ 34 పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి.

- Advertisement -