17 ఏళ్ల తర్వాత చెన్నైపై ఆర్సీబీ విజయం

7
- Advertisement -

ఐపీఎల్ చరిత్రలో 17 ఏళ్ల తర్వాత చెన్నైపై విజయం సాధించింది ఆర్సీబీ. చెన్నై చెపాక్ స్టేడియంలో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 197 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది.

రచిన్ రవీంద్ర 41 పరుగుఉల చేయగా దూబె 19,జడేజా 25,ధోని 30 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ రాణించక పోవడంతో చెన్నై ఓడిపోయింది.ఆర్సీబీ బౌలర్లలో హజల్‌వుడ్ 3,యష్ దయాల్, లివింగ్ స్టోన్ తలో రెండు వికెట్లు తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ 51 పరుగులు చేశాడు. ఈ విజయంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిదర్శనకు తెరదించింది ఆర్సీబీ. 2010 ఐపీఎల్ నుంచి ఆర్సీబీపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలుస్తూ వస్తోంది.

Also Read:హైదరాబాద్‌లో పడిపోతున్న ఆఫీస్ లీజ్..

ఇక ఈ విజయంతో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ విజేతగా నిలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఆర్సీబీ.

- Advertisement -