రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం RC16. ఇవాళ జాన్వీకపూర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో జాన్వీకపూర్ కుడి చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా, ఎడమ చేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Wishing you a very Happy Birthday #janhvikapoor Loved working with you and I can’t wait for everyone to see your terrific character on screen🔥 #RC16 pic.twitter.com/t0bbBtWaiO
— BuchiBabuSana (@BuchiBabuSana) March 6, 2025
Also Read:RC16 సెట్స్‌లో కన్నడ స్టార్!

