మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా వస్తుండగా ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ సినిమాలోని ఒక్కసాంగ్కే కాంతారా సినిమా బడ్జెట్ పెట్టారంట. చిన్న సినిమా కంటెంట్ ఉన్న కథతో వచ్చిన కాంతార ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు అన్ని భాషల్లో కలిపి రూ. 300 కోట్లు రాబట్టింది.
అయితే తాజాగా RC15లో ఒక పాటకోసం శంకర్ ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారట. విదేశాల్లో షూట్ చేయబోతోన్న ఈ సాంగ్ షూటింగ్‌కు దాదాపు 15 కోట్లు ఖర్చు పెడుతున్నారట. కియారా అద్వాణీ, రామ్ చరణ్‌ల మీద ఈ సాంగ్ ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తంగా ఒక్క సాంగ్‌కే శంకర్ ఇంతమొత్తంలో ఖర్చు చేస్తున్నారంటే సినిమా ఏ రేంజ్లో ఉండనుందో ఊహించుకోవచ్చు. అయితే ఒకవేళ సినిమా బొక్కబొర్లా పడితే మాత్రం నిర్మాతలే కాదు డిస్ట్రిబ్యూటర్లకు కోలుకోలేని నష్టాన్ని మిగల్చడం ఖాయం..
ఇవి కూడా చదవండి..