RC 15కు తప్పని లీకుల బెడద..!

97
rc 15
- Advertisement -

పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీకవడం దర్శక, నిర్మాతలను ఆందోళన పెట్టిస్తోంది. తాజాగా రామ్ చరణ్ -శంకర్ కాంబోలో వస్తున్న సినిమాకు లీకుల బెడద తప్పలేదు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుండగా ఆర్కే బీచ్‌లో కొన్ని సీన్లను శంకర్ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నడి రోడ్డు మీద చిందులు వేస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. వీడియో చూస్తుంటే ఇది సాంగ్ షూటింగ్‌లా అనిపిస్తోంది. ఈ వీడియోను అభిమానులు షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

- Advertisement -