పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో నెలకొన్న చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలోనే రూ.200 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ ఆర్డర్ కూడా షురూ అయింది. 2017 ఏడాది ముగియడానికి ముందే ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. అయితే, ఈ నోట్లు ఏటీఎంలలో లభించవు. కేవలం బ్యాంకుల్లో మాత్రమే ఖతాదారులకు అందచేయనున్నారు.
అయితే దీనిపై ఆర్‌బీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రూ.200 నోటు అందుబాటులోకి వస్తే చిన్న నోట్ల సరఫరా-డిమాండ్ మధ్య అంతరం బాగా తగ్గుతుందని, నగదు లభ్యత కూడా మెరుగవుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన ఆర్‌బీఐ అధికారులు రూ.200నోటు ప్రవేశపెట్టే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారట.
2016 నవంబరు 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.