- Advertisement -
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు నేతల హర్షం వ్యక్తం చేశారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా ప్రధాని మోదీ స్వాగతించారు. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకే ఆర్బీఐ ఇవాళ భారీ చర్యలు తీసుకుందని తెలిపారు. ఆర్బీఐ తాజా ప్రకటనతో ద్రవ్య లభ్యత పెరుగడమేగాక, నిధులపై వ్యయం తగ్గుతుందని ప్రధాని అన్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పట్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఉరట లభించిందన్నారు.
- Advertisement -