RBI:వడ్డీ రేట్లు యథాతథం

19
- Advertisement -

వడ్డీరేట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా రెపోరేటులో ఎలాంటి మర్పులు లకేండా 6.5 శాతం యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది.
సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని నిర్ణయించామని, పరిస్థితుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.

ఖరీఫ్‌లో కొన్ని పంటల విత్తడం అంచనా కంటే తక్కువగా ఉందన్నారు. పప్పులు, ఆయిల్ సీడ్స్ ఈ జాబితాలో ఉన్నాయన్నారు. కొన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, అంతర్జాతీయంగా ఆహార, ఇంధనాల ధరల విషయంలో అనిశ్చితి పరిస్థితులు ఉన్నాయన్నారు. కాబట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని అంచనావేశారు.

ఆర్బీఐ విధించే వడ్డీని బట్టి బ్యాంకులు కస్టమర్లపై ఆ భారాన్ని సర్దుబాటు చేస్తుంటాయి. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచలేదు, తగ్గించలేదు కాబట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదు.

Also Read:భగవంత్ కేసరి..థియేట్రికల్ ట్రైలర్

- Advertisement -