- Advertisement -
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారంనాడు 2017-2018 ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన సమీక్ష కమిటీ తెలిపింది.
బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు ప్రస్తుతం 6 శాతంగా ఉంది. దాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. అయితే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ ఆశించిన వృద్ధి రేటు 7.3 కాగా, అది 6.7కు కోత పడింది. అదేవిధంగా రివర్స్ రెపో రేటును కూడా యథాతథంగా 5.75 శాతంగానే ఉంచింది.
- Advertisement -