RBI:వడ్డీ రేట్ల పెంపుపై కీలక నిర్ణయం

64
rbi
- Advertisement -

ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా వడ్డీ రేట్ల పెంపుపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25 శాతం, ఎంఎస్‌ఎఫ్‌ రేటు 6.75 శాతం, బ్యాంక్‌ రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్బీఐ గత ఏడాది మే నుంచి ఆరు సార్లు రెపో రేటు పెంచింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -