త్వరలో కొత్త సిరీస్‌లో రూ. 500నోట్లు చలామణిలోకి రానున్నాయి. దేశంలో మరింత సెక్యూరిటీ ఫీచర్స్ జోడించి మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ లో ఈ కొత్త నోట్లను విడుదల చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త నోటులో ‘ఏ’ అనే అక్షరాన్ని జోడించామని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది.
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు, వెనక వైపు 2017 అని ముద్రించిన కొత్త రూ. 500 కరెన్సీ నోటును విడుదల చేసినట్టు కేంద్ర బ్యాంకు మంగళవారం వెల్లడించింది.
అంతేకాకుండా మిగతా డిజైన్ అంతా ఇప్పటి మహాత్మాగాంధీ సిరీస్ నోట్ల మాదిరిగానే ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్తనోట్లు తీసుకొచ్చినా.. పాత నోట్లు చలామణిలోనే ఉంటాయని పేర్కొంది.
జూన్ 13 మంగళవారం నిర్వహించిన 7 రోజులు, 14 రోజులు మరియు 28 రోజులు ఆర్బిఐ వేరియబుల్ రేట్లు (రెపో రివర్స్, రెపో) ఈ ప్రకటన జారీ చేసింది. దాదాపు పాతనోటును పోలిన 66 ఎంఎంx150 ఎంఎం, స్టోన్ గ్రే కలర్, రెడ్ ఫోర్ట్ భారతీయ వారసత్వ ప్రదేశం ఎర్ర కోట – రివర్స్ లో భారతీయ జెండా స్పెసిఫికేషన్స్ తో దీన్ని రూపొందించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే మహాత్మా గాంధీ చిత్రపటాన్ని, అశోక్ స్థంభం కుడివైపున బ్లీడ్ లైన్స్ ఇతర గుర్తులతోపాటు, అంధులు గుర్తించేలా ఇంటగ్లియో ముద్రణను కూడా జత చేసింది.
కాగా గతేడాది నవంబర్‌లో పెద్దనోట్లను రద్దుచేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. రూ. 500, రూ. 1000 పాత నోట్లను రద్దు చేసి.. ఆ స్థానంలో కొత్త రూ.2000నోట్లు, రూ. 500 నోట్లను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం రూ.500 నోట్లలో ఏ అక్షరాన్ని చేర్చి కొత్త సిరీస్ నోట్లు తీసుకు రానుంది ఆర్బీఐ.