ద్యవ్యపరపతి సమీక్షలో భాగంగా సామాన్యులకు షాకిచ్చింది ఆర్బీఐ. రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25శాతం నుంచి 6.50 శాతానికి చేరుకుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్దిరోజులకే మంగళవారం 2023 సంవత్సరానికి సంబంధించిన తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రెపో రేటు పెంపు కారణంగా హోం లోన్స్, ఆటో, పర్సనల్ లోన్ వరకు అన్నింటికీ వడ్డీ రేట్లు పెరగనున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను 5.90 శాతం నుంచి 6.25 శాతంకు పెంచారు. 2024 సంవత్సరంలో ద్రవ్వోల్బణం నాలుగు శాతానికి మించి ఉంటుందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ డీజీపీ 6.4శాతానికి చేరుకోవచ్చని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..