పెద్దనోట్ల రద్దుతో నేటికి ప్రజలు నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న సమస్యలకు త్వరితగతన సమస్య పరిష్కరం చేస్తున్నామంటూ కేంద్రం రోజుకో ప్రకటన చేస్తునే ఉంది…కాని అది కేవలం ప్రకటనలు గానే మిగిలిపోతున్నాయి. దినసరి కూలీలు సైతం తమ పనులు మానుకోని డబ్బులు ఎక్స్చేంజి కోసం రోజు బ్యాంక్ క్యూలైన్‌లో నిలబడుతున్నారు. ఇక ఏటీఎంలూ మాత్రం ఎనీ టైమ్ మూతే అన్నట్టుగా దర్శమిస్తున్నాయి. నోట్ల రద్దు సమస్య కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉండినట్లయ్యందని సామన్య ప్రజలు మండిపడుతున్నారు.
ప్రభుత్వం విత్ డ్రా పరిమితిని వారానికి రూ.24 వేలుగా పేర్కొన్నా ఏ బ్యాంకూ అంత మొత్తం ఇచ్చే పరిస్థితి లేదు. కష్టమ్మీద రూ.4వేలు మాత్రం బ్యాంక్ వాళ్లు చేతికి ఇస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పాత పెద్ద నోట్లు తప్ప.. కొత్త నోట్లు, పనికొచ్చే పాత చిన్న నోట్లూ డిపాజిట్ చేసేవారే లేకుండా పోయారు. దీంతో నగదు చలామణీ మందగించి పోయింది. ఈ నేపథ్యంలో.. బ్యాంకుల్లో కొత్త నోట్లు, పనికొచ్చే పాత నోట్ల డిపాజిట్లను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంది. ఖాతాలో వేసినంత సొమ్మును.. వితడ్రాయల్ పరిమితికి మించి తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.
నవంబర్ 29 అంటే ఈరోజు నుంచి ఎవరైనా ప్రస్తుతం చెల్లుబాటయ్యే కరెన్సీ(రూ. 2000, 500, 100, 50, 20, 10, 5) రూపంలో రూ. 4 వేలు డిపాజిట్ చేస్తే అతని విత్‌డ్రా పరిమితి ప్రస్తుత లిమిట్(వారానికి రూ. 24 వేలు)కి అదనంగా మరో 4 వేలు పెరుగుతుంది. చెల్లుబాటు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతమున్న విత్‌డ్రా గరిష్ట పరిమితి దృష్ట్యా చాలామంది ఖాతాదారులు నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వెనకాడుతున్నారని ఆర్బీఐపేర్కొంది. అయితే విత్‌డ్రా చేసుకునే నగదుకు రూ. 2 వేలు, రూ. 500 నోట్లు ఇవ్వవచ్చని తెలిపింది.