నైరుతి రుతుపవనాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తి పెరగడం వంటి అంశాలు ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగేందుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది ఆర్బీఐ. వార్షిక నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ.. భారత ఆర్థిక వ్యవస్థ దాని స్థిరమైన స్థూల ఆర్థిక మూలాలు, బలమైన ఆర్థికరంగం, స్థిరమైన వృద్ధిని సాధించడంతో 2025-26లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది.
2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుందని ప్రకటించింది. ద్రవ్యోల్బణ అంచనాలు, జిడిపి వృద్ధిలో నియంత్రణ, ద్రవ్యవిధానం ముందుకు సాగేందుకు మద్దతునిస్తున్నాయని ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
వరుసగా రెండు సమీక్షలలో కీలక పాలసీ రేట్లను తగ్గించిన ఆర్‌బిఐ 12నెలల కాలంలో ద్రవ్యోల్బణం 4శాతం లక్ష్యానికి చేరుకునేందుకు అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే .. ముఖ్యంగా నికర వడ్డీ మార్జిన్లలో నియంత్రణ దృష్ట్యా బ్యాంకులు ట్రేడింగ్, బ్యాంకింగ్ బుక్ రిస్క్‌లను పరిష్కరించుకోవాలని ఆర్‌బిఐ సిఫారసు చేసింది.
Also Read:ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై BRSV పోరుబాట

