కివీస్‌పై భారత్ ఘనవిజయం..సిరీస్ కైవసం

225
india vs newzealand
- Advertisement -

బే ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది. 244 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 43 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్యం చిన్నది కావడంతో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతూ టార్గెట్‌ని చేధించారు. ఓపెనర్ రోహిత్ శర్మ,కెప్టెన్ విరాట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఔటైన రాయుడు,దినేశ్ కార్తీక్ కలిసి లక్ష్యాన్ని పూర్తిచేశారు. కార్తీక్‌(38),రాయుడు (40) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.

ఓపెనర్ రోహిత్ శర్మ 63 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. హిట్‌మ్యాన్‌కు వన్డే కెరీర్‌లో ఇది 39వ ఫిఫ్టీ కావడం విశేషం.62 పరుగులు చేసిన రోహిత్ పెవిలియన్ బాటపట్టారు. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీలతో చెలరేగుతూ 59 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. విరాట్‌ఖు వన్డేల్లో 49వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను మూడో వన్డేలోనూ కట్టడి చేయడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. తమ వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆతిథ్య ఆటగాళ్లను ఈ మ్యాచ్‌లోనూ వణికించారు. రాస్ టేలర్(93), టామ్ లాథమ్(51) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్య(2/45), చాహల్(2/51) వికెట్లు తీశారు.

- Advertisement -