మనసు మార్చుకున్న రాయుడు.. రిటైర్మెంట్ వెనక్కి..?

536
rayudu
- Advertisement -

ప్రపంచకప్‌ భారత జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశచెందిన హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రాయుడు నిర్ణయంపై బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బోర్డు పెద్దల విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ ఆలోచన వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ (టీఎన్‌ఎస్‌ఏ) వన్డే లీగ్‌లో గ్రాండ్‌ స్లామ్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. మళ్లీ టీమిండియా, ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో తనరిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

2013లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన రాయుడు తర్వాత పేలవ ఫామ్, ఫిట్‌నెస్ కారణంగా జట్టుకి దూరమయ్యాడు. అయితే 2018 ఐపీఎల్ సీజన్‌లో రాణించడంతో మళ్లీ జట్టులో చేరిన రాయుడు ప్రపంచకప్‌లో నెంబర్ 4గా ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సెలక్టర్లు రాయుడికి మొండిచేయి చూపారు. దీంతో బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిటైర్మెంట్‌ని ప్రకటించాడు.

- Advertisement -