- Advertisement -
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్లకు వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇక టీఎస్ఆర్టీసీ సైతం ఆర్ఆర్ఆర్‌ని ప్రచారానికి వాడుకుని ఆర్ఆర్ఆర్ అంటే రాష్ట్ర రోడ్డు రవాణా అంటూ కొత్త అర్థాన్నిచ్చింది.
ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ పేరుతో కండోమ్ ప్రచారాన్ని చేపట్టింది ఓ కంపెనీ. ‘రా.. రెస్పాన్సిబుల్.. రొమాన్స్’ అంటూ స్కోర్ అనే సంస్థకు చెందిన కండోమ్ ప్రమోషన్ ఇది. అచ్చం ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ తరహాలో దీన్ని డిజైన్ చేశారు. ఈ కొత్త ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
- Advertisement -