పచ్చిపాలు..ఆ సమస్యలు దూరం!

26
- Advertisement -

చలికాలంలో చర్మ సమస్యలు సర్వసాధారణం. వాతావరణ మార్పుల కారణంగా చర్మంపై పగుళ్లు, పొడిబారటం వంటి సమస్యలు కనిపిస్తాయి.. ఇంకా కొందరిలో ఈ పగుళ్ళ కారణంగా మంట, నొప్పి వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల వీటి నుంచి బయట పడటానికి చాలమంది మార్కెట్లో దొరికే క్రీమ్స్, బాడీ లోషన్స్, వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని ఉపయోగించడం కంటే సహజ సిద్దంగా చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా చలి కాలంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించేందుకు పచ్చిపాలు బాగా ఉపయోగ పడతాయట. పచ్చిపాలను వారంలో రెండు లేదా మూడు సార్లు చర్మానికి పట్టిస్తే చర్మం హైడ్రేట్ గా మారుతుంది. .

అందువల్ల చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది. చర్మానికి సమాజమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. తద్వారా చర్మంపై పగుళ్లు తగ్గిపోతాయి. ఇంకా పాలలోని ఫ్యాట్, ప్రోటీన్స్ మార్చరైజర్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా కూడా మార్చుతాయి. పాలలో ఉండే విటమిన్ ఏ, ఇ, డి వంటివి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఇంకా కొందరులో చిన్న వయసులోనే ముడతల సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కూడా పచ్చి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముడతల సమస్య తగ్గుతుంది. అయితే పాలకు ఉండే వాసన కారణంగా చర్మానికి రాసుకునేందుకు కొంతమంది ఇబ్బంది పడుతుటారు. అలాంటి వారు పాలలో కొద్దిగా పసుపు, లేదా తేనె కలిపి రాసుకుంటే పాలకు ఉండే వాసన తగ్గుతుంది. అంతే కాకుండా వాటి కారణంగా చర్మం యొక్క నిగారింపు కూడా పెరుగుతుంది.

Also Read:TTD:లడ్డు నాణ్యత మరింత పెంచుతాం

- Advertisement -