కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గమైన బాగుపడిందా?

27
- Advertisement -

కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానలు కొండంత. కాంగ్రెస్ 420 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. నాలుగు నెలలుగా అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు రావుల శ్రీధర్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రావుల..అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్ని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అన్నారు.

మైనారిటీలకు రిజర్వేషన్‌లు కల్పిస్తాం, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు…మైనారిటీలకు ప్రత్యేకంగా 12 హామీలు ఇచ్చారు వాటిలో అమలు చేసింది ఎన్ని? చెప్పాలని డిమాండ్ చేశారు. మైనారిటీల ఉపాధి కల్పనకు వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు…
IMAMS AND MOUZANS, పాస్టర్లు, వీళ్లందరికి 10 నుంచి 12 వేల వరకు గౌరవ వేతనం ఇస్తామన్నారు…హామీలు నేరవేర్చాలనే సోయి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.

నాలుగు నెలలుగా ఏ ఒక్క వర్గమైనా నీ వల్ల బాగుపడిందా?…మైనారిటిలను ఓట్లడిగే హక్కు రేవంత్ రెడ్డికి లేదు అన్నారు.మైనార్టీలకు ఇచ్చిన హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తావో చెప్పే ధైర్యం నీకు ఉందా…మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ పార్టీ చూసిందన్నారు.
కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మైనారిటీల అభివృద్ధికి కృషి చేశారు..మైనారిటీలకు షాదీ ముభారఖ్, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్ ఇచ్చినం, ముస్లిం మైనారిటీల కోసం స్కూల్స్ పెట్టినం అన్నారు.రంజాన్ వేడుకులను ఘనంగా నిర్వహించింది. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా బీఆర్ఎస్ సర్కార్ ప్రతి సంవత్సరం ఇచ్చిందన్నారు.రేవంత్ రెడ్డికి ప్రజలు మీద ప్రేమలేదు కానీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు ఇప్పించుకోవాలని చూస్తాడు ..కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేసి మోసపోవద్దు అన్నారు.

Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

- Advertisement -