మరో సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్న రవితేజ్‌

1404
vikramarkudu
- Advertisement -

టాలీవుడ్‌ స్టార్ హీరోలంతా నువ్వానేనా అనే రేంజ్ లో పోటీ పడుతు సినిమాలు చేస్తుంటే,,ఓ హీరో మాత్రం నాకేం పట్టనట్టుగా ఉండిపోయాడు. అయనే మాస్ మహా రాజా రవితేజ. గతంలో ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసే రవితేజ,,,ఈ మధ్య బాగా స్లో అయిపోయాడు. బెంగాల్ టైగర్ సినిమా వచ్చి ఏడాదిన్నర కావస్తున్న ఇంత వరకు మరో సినిమాను ప్రారంభించలేదు. దీంతో రవితేజపై అనేక ప్రచారాలు ఊపందుకుంటున్నాయి.

ఇక రవితేజ పని అయిపోయిందని..రవితేజకు సరైన కథలు దొరకడంలేదని,,రెమ్యునరేషన్‌ వద్ద బేరం కుదరడం లేదని ఇలా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలె పవర్ దర్శకుడు బాబీ తో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చినా దానిపై ఇంకా ఎలాంట క్లారిటీ లేదు. అయితే ఇది ఇలా ఉండగా రవితేజ తన హిట్‌ సినిమాలోని ఒక మూవీకి సీక్వెల్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

46357865306603630753

దర్శక ధీరుడు రాజమౌళి ..మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో 2006 లో వచ్చిన విక్రమార్కుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ మూవీతో రవితేజ మార్కెట్ భారీగా పెరిగింది. విక్రమార్కుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి కారణం రాజమౌళి డైరెక్షన్. రవితేజని ‘అత్తిలి సత్తిబాబు’, ‘విక్రం రాధోడ్’ లాంటి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో రాజమౌళి ప్రెజెంట్ చేసాడు. దాంతో రవితేజకి ఎమోషన్ ని పీక్స్ లో పండించగలడని న్యూ ఇమేజ్ వచ్చింది. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా కు కొనసాగింపుగా సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట రవితేజ.

vikramarkudu

విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట విజయేంద్ర ప్రసాద్. బాహుబలి2 తరువాత ఈ సీక్వెల్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక లీడ్ రోల్ రవితేజతోనే చేయించాలనుకుంటున్నారట. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ సీక్వెల్ ని రాజమౌళి డైరెక్ట్ చేయడట. రాజమౌళి డైరెక్షన్ టీంలోని ఓ యంగ్ డైరెక్టర్ విక్రమార్కుడు సీక్వెల్ డైరెక్ట్ చేస్తాడట.

vikramarkudu

అయితే విక్రమార్కుడు మూవీతో రాజమౌళి తన టేకింగ్ తో ఓ బెంచ్ మార్క్ సెట్ చేసాడు.. దాన్ని సీక్వెల్ తో క్రాస్ చేయాలంటే ఒక్క రాజమౌళికే సాధ్యం.. కొత్త డైరెక్టర్ తో అవుతుందా కాదా అని లెక్కలేసుకుంటున్నారట ట్రేడ్ పండితులు. మరి కిక్ సీక్వెల్‌ తో బోల్తాకొట్టిన రవితేజ,,,మరోసారి విక్రమార్కుడుకు సీక్వెల్ దైర్యం చేస్తాడో లేదో చూడాలి. డైరెక్టర్ కోసం కథల కోసం తెగ వెతుకుతున్న రవితేజ కు ఈ సినిమా అన్న ఫైనల్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -